ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా' అధ్యక్షుడిగా నరేశ్

హోరాహోరీగా సాగిన 'మా' అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేశ్​ విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన పోరులో శివాజీరాజాపై నరేశ్ గెలుపొందారు.

By

Published : Mar 11, 2019, 8:06 AM IST

Updated : Mar 11, 2019, 8:25 AM IST

'మా' అధ్యక్షుడిగా నరేశ్

'మా' అధ్యక్షుడిగా నరేశ్

తెలుగు నటీనటుల సంఘం నూతన అధ్యక్షుడిగా నరేశ్​ ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు శివాజీరాజాపై ఆయన విజయం సాధించారు. నిన్న మధ్యాహ్నంపోలింగ్ పూర్తి కాగా.. ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మొత్తం 745 ఓట్లకు గాను 472 ఓట్లు పోలైయ్యాయి. వాటిని లెక్కించిన అధికారులు 'మా' అధ్యక్ష పదవి రేసులో నరేష్ విజయం సాధించినట్లు ప్రకటించారు.

నీకు 50 ఓట్లు కూడా రావు, జీవితంలో 'మా' అధ్యక్షుడివి కాలేవు అని శివాజీరాజా ఎద్దేవా చేశాడు. కానీ 70 ఓట్ల మెజార్టీతో గెలిచాను. ఎన్నికల ఫలితాలనుపట్టించుకోకుండా.. అందరం కలిసి పనిచేద్దాం--- 'మా' అధ్యక్షుడు నరేశ్

స్వతంత్ర అభ్యర్థి హేమ విజయం

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్​గా రాజశేఖర్ విజయం సాధించారు. జనరల్ సెక్రెటరీగా జీవిత రాజశేఖర్ ఎన్నికయ్యారు. 'మా' ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హేమ గెలుపొందారు. గెలిచిన కార్యవర్గం 2021 వరకు నటీనటుల సంఘానికి సేవలందించనుంది. ఆసక్తి కరంగా సాగిన ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ సభ్యులు విజయం సాధించడం పట్ల మద్దతుదారులు, అభిమానులు సంబురాలు చేసుకున్నారు.

ఇవీ చూడండి:'కీర్తి సురేష్' కోసం వెంకటేష్

Last Updated : Mar 11, 2019, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details