అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వనని ప్రపంచ బ్యాంకు తప్పుకోవటంతో సీఎం జగన్ కల నెరవేరిందని నారా లోకేశ్ విమర్శించారు. జగన్ చర్యల వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. 'మొత్తానికి అమరావతిని పడగొట్టేశారు.. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవు అంది. బాబు హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయ్యింది. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే కార్యాచరణలో జగన్ మొదటి అడుగు విజయవంతంగా వేశారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో!' అని ట్వీట్ చేశారు.
' కలల రాజధాని.. కలగానే మిగిలిపోతుందేమో!' - tweets
ముఖ్యమంత్రి జగన్‌పై ట్విటర్లో నారా లోకేశ్ విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచబ్యాంకు రుణం ఆగిపోవడానికి వైకాపా ప్రభుత్వమే కారణమంటూ ట్వీట్లు చేశారు.
నారా లోకేశ్
కియా వైఎస్ఆర్ వల్లే వచ్చిందని అసెంబ్లీలో బుగ్గన చేసిన వ్యాఖ్యలపైనా లోకేశ్ వ్యంగంగా స్పందించారు. 'అధిక వడ్డీకి మీరు ఆంధ్రాకి లోన్ ఇవ్వొద్దు అంటూ వరల్డ్ బ్యాంక్‌కి 2006 లోనే వైఎస్ లేఖ రాశారు. అందుకే ఆయనపై ఉన్న గౌరవంతో వెనక్కి వెళ్లారు అని మంత్రి బుగ్గన లేఖ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు' అంటూ మరో ట్వీట్ చేశారు లోకేశ్.