ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తెలుగుదేశంపార్టీకే వర్తిస్తాయా అంటూ లోకేశ్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఎండలు, తాగునీటి సమస్యలపైనా సీఎం సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపోతే ప్రజల పరిస్థితేంటని నిలదీశారు. ఈసీ ఆంక్షలపై ట్విటర్ వేదికగా మండిపడ్డ ఆయన... ఎన్నికల కొడ్ ఒక్క ఏపీలోనే ఉందా అని అడిగారు.
తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధానకార్యదర్శి సహా డీజీపీ పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు చేస్తోందన్నారు. తెలంగాణలో కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. ఏంటీ పక్షపాతమని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎన్నికల కోడ్ ఏపీలోనే ఉందా? తెలంగాణలో లేదా? - ec
ఈసీ ఆంక్షలపై ట్విటర్ వేదికగా లోకేశ్ మండిపడ్డారు. ఎన్నికల కొడ్ ఒక్క ఏపీలోనే ఉందా అని అడిగారు. తెలంగాణలో కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. ఏంటీ పక్షపాతమని నిలదీశారు.
లోకేశ్
ఇదీ చదవండి
Last Updated : Apr 20, 2019, 4:18 PM IST