కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా ఉపాధి హామీ పథక అమలులో సమస్యలపై మంత్రి మాట్లాడారు. భాజపాయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉపాధి హామీ వేతనాల నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న బంగాల్, తెదేపా అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, వామపక్షాలు అధికారంలో ఉన్నకేరళ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదన్నారు. అయినా.. రాష్ట్రంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కేంద్ర నిధులతో సంబంధం లేకుండా వేతనాలు చెల్లిస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు.