ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి గీత - bjp

జన జాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత భాజపా గూటికి చేరారు. దిల్లీలో కేంద్రమంత్రి అమిత్​షా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

భాజపా తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి గీత

By

Published : Jun 18, 2019, 5:54 PM IST

మాజీ ఎంపీ, జన జాగృతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొత్తపల్లి గీత భాజాపా తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తాను స్థాపించిన జన జాగృతి పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేస్తానని గీత ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్తపల్లి గీత 2014లో వైకాపా తరఫున అరకు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతరం తెదేపాలో చేరుతారనే ప్రచారం సాగినప్పటికీ అది జరగలేదు. గతేడాది ఆగష్టులో జగజాగృతి పార్టీని స్థాపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details