పేదల ప్రగతికి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలకు రుణాలు మంజూరు చేయాలని మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఉప కలెక్టరు కార్యాలయంలో జరిగిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ బ్యాంకర్ల జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పేదల గృహ నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు. ఆ దిశగా బ్యాంకర్లు, అధికారులు పని చేయాలని సూచించారు. సంక్షేమ, స్వయం సహాయ పథకాలకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలన్నారు.
"సంక్షేమ పథకాలకు రుణాలు అందించాలి"
సంక్షేమ పథకాలకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలని మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. విజయవాడలో జరిగిన బ్యాంకర్ల జిల్లా స్థాయి సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు.
మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్
కౌలు రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు మంజూరు అయ్యేలా 11 నెలల ఒప్పందం అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. టిడ్కో చేపట్టిన గృహ నిర్మాణాలపై మంత్రులు ఆరా తీశారు. ఈ సమావేశానికి కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అధ్యక్షత వహించారు. ఈ ఏడాది పది శాతం నుంచి ఇరవై శాతం వృద్ధి రేటు సాధించేలా... ప్రణాళికాయుతంగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి...పూర్తి సమయం తెలుగు తమ్ముళ్ల కోసమే..!