'ముఖ్యమంత్రి జగన్ కు కేశినేని రెండు ప్రశ్నలు' - jagan
ఫేస్‌బుక్ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌కి విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న జరిగిన సీఎంల భేటీని అభినందిస్తూనే పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
'ముఖ్యమంత్రి జగన్ కు కేశినేని రెండు ప్రశ్నలు'
తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రుల చర్చలపై ఫేస్‌బుక్ వేదికగా ఎంపీ కేశినేని నాని స్పందించారు. సమస్యల పరిష్కారానికి కేసీఆర్‌తో చర్చ విషయంలో జగన్ చూపుతున్న చొరవను అభినందిస్తున్నానని అన్నారు. ప్రతీ అంశంలోనూ తెలంగాణకు అనుకూలంగా జగన్ వ్యవహరిస్తున్నారా? లేక ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ప్రతిదీ సాధిస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రశ్నలను సామాజిక మాధ్యమం వేదికగా సంధించారు.