ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దశాబ్దాల పోరాటం.. తెదేపాతో సాకారం..! - కాపు సంక్షేమం

మాట ఇచ్చారు....మేనిఫెస్టోలో ఉంచారు...ఇచ్చిన మాట తప్పకుండా అడుగులు వేశారు. సాధ్యం కాదు అనుకున్న రిజర్వేషన్​ను సుసాధ్యం చేశారు. ఆ వర్గం కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టడమే కాకుండా.. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇదీ అధికార తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం విషయంలో చొరవ..!

దశాబ్దాల పోరాటం.. తెదేపాతో సాకారం..!

By

Published : Apr 2, 2019, 8:03 AM IST

దశాబ్దాల పోరాటం.. తెదేపాతో సాకారం..!
రిజర్వేషన్ అందుకోవాలన్న కాపుల దశాబ్దాల కలను తెలుగుదేశం సాకారం చేసింది. అసాధ్యమంటూ అందరూ పక్కన పెట్టిన కాపు రిజర్వేషన్ అంశాన్నిచిత్తుశుద్ధితో ముందుకు తీసుకెళ్లింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో 5 శాతాన్ని కాపులకు కేటాయించింది. రిజర్వేషన్లతో సరిపెట్టకుండా.. వారి సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది.

దశాబ్దాల కల

మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు కాపులు బీసీలుగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో వారిని బీసీ జాబితా నుంచి తొలగించారు. అప్పటి నుంచి వాళ్లు రిజర్వేషన్ కోసం అడుగుతూనే ఉన్నారు. 1994లో ముద్రగడ పద్మనాభం మంత్రి పదవికి రాజీనామా చేసి కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు రిజర్వేషన్ హామీలు ఇస్తున్నాయే కానీ అమలు విషయంలో చొరవ చూపలేదు. కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చిన వైఎస్..విశ్రాంత న్యాయమూర్తి దళవాయి సుబ్రమణ్యం కమిషన్ ను ఏర్పాటు చేసినప్పిటికీ సరైన నిధులు ఇవ్వలేదు. చివరికి.. నివేదిక ఇవ్వకుండానే కమిషన్ కాలం ముగిసింది.

నిలబెట్టుకున్న హామీ

తెదేపా అధినేత చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తుశుద్ధితో పనిచేశారు. జస్టిస్ మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి.. శాసనసభ చివరి సమావేశాల్లో కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. అగ్రవర్ణాలకు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించారు. బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లకు ఇబ్బందిలేకుండానే రిజర్వేషన్లు అమలు చేప్రకటించింది.

బీసీ(ఎఫ్)...

50 ఏళ్లుగా కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ఆ వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామంటూ 2017 చివర్లో బీసీల్లో చేరుస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అప్పటి శాసనసభలో బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపారు. ప్రస్తుతం బీసీల్లో ఉన్న ఏ, బి, సి, డి,ఈ, కేటగిరీలకు అదనంగా ‘ఎఫ్’ కేటగిరిగా కాపులను (కాపు, బలిజ, ఒంటరి, తెలగ ) అందులో జతచేసి వారికీ 5 శాతం రిజర్వేషన్లుకల్పించారు. విద్య, ఉద్యోగాలు క్షేమ పథకాల్లోనే వారికి రిజర్వేషన్లు వర్తించేలా బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌ల్లో దీన్ని చేర్చి ఆమోదం తెలపాలని పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. అయితే కేంద్రం దీనిపై స్పందించకపోవడంతో కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించే అంశంపై నీలినీడలు కమ్ముతున్నాయి.

10లో ఐదు శాతం...

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదింపజేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్నే అనుకూలంగా మలుచుకునేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బీసీలకు కల్పించాల్సిన పది శాతం రిజర్వేషన్లుకు ఆమోదం తెలుపుతూనే.. అందులో ఐదు శాతం కాపులకు కేటాయించాలని తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమైయ్యాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు ఆత్మరక్షణలోకి నెట్టినట్లయ్యింది. కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లలో మహిళలకు 33 శాతం అమలుచేయనున్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా

కేవలం రిజర్వేషన్ల అంశంతోనే సరిపెట్టకుండా....గడిచిన ఐదేళ్ల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తీరును గుర్తు చేస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటంతో పాటు... 3 వేల 100 కోట్ల రూపాయల నిధులు వారి సంక్షేమం కోసం ఖర్చు చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ ద్వారా 4 వేల 528 మంది కాపు విద్యార్థులకు లబ్ధిచేకూరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన ఉపముఖ్యమంత్రి పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకునికి కట్టబెట్టి రాజకీయంగా పెద్ద పీటవేసింది. ప్రతి జిల్లాలో కాపు కార్పొరేషన్ భవన్​లను ఏర్పాటు చర్యలు తీసుకోవటంతో పాటు... ఒక్కో భవనానికి 5 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించారు.

అండగా నిలుస్తారని ఆశ..

గత పాలకులు కాపులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని వారిని అభివృద్దికి ఆమడ దూరంలో ఉంచారన్నది తెదేపా ప్రధాన ఆరోపణ. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ కాపులకు రిజర్వేషన్ల హామీ ఇచ్చి ఆశల పల్లికిలో ఊరేగించిందని విమర్శిస్తోంది.ఎన్నికల వేళ కావడంతో కాపుల అభివృద్ధికి తెదేపానే కృషి చేసిందనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది.

కాపుల రిజర్వేషన్లపై తెదేపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ సామాజిక వర్గమంతా హర్షిస్తూ... ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు అండగా నిలుస్తందనే విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details