'కాపులు పండగ చేసుకోవాల్సిన సమయం' - AP ASSEMBLY
విద్య, ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఉంటాయని... రాజకీయాల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
కాపులు పండగ చేసుకోవాల్సిన సమయం: అచ్చెన్నాయుడు
రిజర్వేషన్ల పేరుతో కాపులకు, ఇతర వర్గాలకు మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం... 5 శాతం రిజర్వేషన్లలో మహిళలకు 1/3 వంతు కేటాయింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఉంటాయని... రాజకీయాల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవని స్పష్టం చేశారు.
Last Updated : Feb 7, 2019, 11:30 PM IST