ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నేహితుడికి మద్దతు తెలిపేందుకే వచ్చా: ఫరూఖ్ అబ్దుల్లా - TELUGU DESAM

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ఏపీని కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. హామీల అమలు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న నా స్నేహితుడు చంద్రబాబుకు ఎన్నికల్లో మద్దతు తెలిపేందుకు రాష్ట్రానికి వచ్చా. - ఫరూఖ్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి

SD

By

Published : Mar 26, 2019, 10:04 AM IST

Updated : Mar 26, 2019, 12:10 PM IST

ఫరూఖ్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్య
సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకే రాష్ట్రానికి వచ్చానని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందన్న ఆయన... రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.ముందు దేశ ప్రజలకు రక్షణ కల్పించు...
చౌకీదారులుగా చెప్పుకునే మోదీ ముందు ప్రజల సంపద, ప్రాణాలకు రక్షణ కల్పించాలనిఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని చాయ్ వాలాగానో, చౌకీదారుగానో ఎవరూ గుర్తించటం లేదన్నారు. జీఎస్టీ, నోట్లరద్దు వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని...ముస్లింలకు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.
జవానుల త్యాగం రాజకీయం చేస్తున్నారు...
పాకిస్తాన్‌పైదాడి చేశామని చెప్పుకుంటూ జవానుల త్యాగాలను సైతం భాజపా రాజకీయం చేస్తోందని అబ్దుల్లా మండిపడ్డారు. గొంతెత్తిన ప్రతిపక్షాలను ప్రభుత్వ వ్యవస్థల ద్వారా అణిచిపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనిఆరోపించారు. గతంలో వాజ్‌పేయీ సారథ్యంలో 23పార్టీలు కలిసి పనిచేశాయని గుర్తు చేశారు. ఇప్పుడుఅందుకు భిన్నమైన పరిస్థితి ఉందని విమర్శించారు.

ఇవీ చూడండి.

Last Updated : Mar 26, 2019, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details