నేడు జగన్ గృహ ప్రవేశం - thadepalligudem
ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి లో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి నేడు గృహ ప్రవేశం చేయనున్నారు. పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అక్కకడే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడితో కలిసి నేడు వైకాపాలోకి చేరనున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించిన సొంతింట్లో వైకాపా అధ్యక్షుడు జగన్ నేడు ఉదయం గృహ ప్రవేశం చేయనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ఈ భవనంలో అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. ఇంటికి సమీపంలోనే నిర్మించిన వైకాపా రాష్ట్రకార్యాలయాన్నిప్రతిపక్ష నేత ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబం సభ్యులు, పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు.
వైకాపాలోకి దగ్గుబాటి
దగ్గుబాటి వెంకటేశ్వరరావు... తన కుమారుడు హితేశ్‌తో కలిసి నేడు వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారు. తాడేపల్లిలోని పార్టీ నూతన కార్యాలయంలో జగన్ సమక్షంలో వైకాపా కండువాకప్పుకోనున్నారు.