ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున కీలక ప్రకటనలు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవరత్నాలతోపాటు నూతన అంశాలపైనా... జగన్ దృష్టిసారించినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లపై... మాజీ సీఎస్ అజయ్‌కల్లాం ఇప్పటికే జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. జగన్‌తో సుదీర్ఘంగా భేటీ అయిన అజయ్‌కల్లాం... రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు వివిధ శాఖలపై తీసుకోవాల్సిన కొత్త నిర్ణయాలపై చర్చించినట్లు సమాచారం.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా శాఖల వారీగా సంక్షిప్తంగా సమాచారాన్ని జగన్‌కు ఇచ్చారు. ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఎంత... ఇంకా కేంద్రం నుంచి రావాల్సింది ఎంత అనే వివరాలు ఇచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా సీఎస్ జగన్‌కు వివరాలు అందజేశారు.