ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు...ప్రత్యేక హోదాపై సీఎం ప్రకటన!

ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి జగన్.. ఇవాళ శాసనసభలో ప్రకటన  చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలన్న అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అయినందున గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా సీఎం జగన్‌ సమాధానం ఇవ్వనున్నారు.

jagan-on-special-status

By

Published : Jun 18, 2019, 7:59 AM IST

ప్రత్యేక హోదా సాధన విషయంలో ప్రభుత్వ కార్యాచరణపై ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రత్యేక హోదా అవసరాన్ని వివరించిన సీఎం జగన్ పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావించే అంశంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మొత్తం రాష్ట్ర పరిస్థితితో పాటు స్పెషల్ స్టేటస్ అవసరం పై 98 పేజీల నివేదికను నీతి ఆయోగ్ కు ఆయన సమర్పించారు.

అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు...ప్రత్యేక హోదాపై సీఎం ప్రకటన!
విభజన కారణంగా ఏపీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటోందని.. భారీగా ఆదాయ లోటు కూడా పెరుగుతోందని సీఎం జగన్​ నీతి ఆయోగ్ సమావేశంలో వివరించారు. 2015 నుంచి 2020 వరకూ ఐదేళ్ల కాలంలో ఏపీకి రెవెన్యూ లోటు 22 వేల 113 కోట్ల వరకూ ఉంటుందని 14 ఆర్థిక సంఘం అంచనా వేసిందని తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి అధికంగా నిధులు , ప్రత్యేకంగా గ్రాంట్లు అందే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ మినహాయింపు, ఇతర రాయితీలు , పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందడం ఏపీకి అత్యవసరమని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలన్న అంశంపై సీఎం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మెుదట ఉదయం 9 గంటలకు ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు, సంజీవరెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, బి.సుబ్బారెడ్డి లకు సభలో సంతాపాన్ని తెలపనున్నారు. 11 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ పదవికి బాపట్ల శాసనసభ్యుడు కోనరఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది.

ABOUT THE AUTHOR

...view details