ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యాప్, టీవీ, వెబ్‌సైట్‌ ద్వారా ఇంటర్ ఫలితాలు

ఈనెల 12 న విడుదల కానున్న ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల ఆర్టీజీఎస్ వెబ్​సైట్​లో తెలుసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈసారి టీవీ తెరపైనా ఫలితాలు తెలుసుకునే అవకాశాన్ని ఆర్టీజీఎస్ కల్పించింది.

యాప్,టీవీ, వెబ్‌సైట్‌ ద్వారా ఇంటర్ ఫలితాలు తెలుసుకునే అవకాశం.

By

Published : Apr 10, 2019, 6:02 PM IST

ఈ నెల 12న విడుదల చేయనున్న ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్నెన్స్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చ‌ని ఆర్టీజీఎస్ ఓ ప్రకటన‌లో తెలిపింది. ఈ ఫలితాలను ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లోనూ, పీపుల్స్ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌, ఖైజాలా యాప్‌లో పొందుప‌రిచారు. ఫైబ‌ర్‌నెట్ క‌నెక్ష‌న్ల వినియోగ‌దారులు సైతం ఇంట‌ర్ ఫ‌లితాల‌ను ఇంట్లోని టీవీ తెర‌పైన తీసుకునే స‌దుపాయం క‌ల్పించింది.
ఫలితాల కోసం ఈ వెబ్​సైట్స్​ను సందర్శించండి...
ఫలితాల కోసం విద్యార్థులుwww.rtgs.ap.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ చేసి ఫ‌లితాలు తెలుసుకోవ‌చ్చు. పీపుల్స్ ఫ‌స్ట్ సిటిజ‌న్ మొబైల్ యాప్‌, ఖైజాలా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ప్రకటించారు. పీపుల్స్ ఫ‌స్ట్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లోhttps://bit.ly/2E1cdN7 ద్వారా, ఖైజాలా యాప్‌ను https://aka.ms/apresult ద్వారా డౌన్‌లోడు చేసుకొని ఫ‌లితాలు తెలుసుకోవ‌చ్చ‌ని సూచించింది. ఈ అవ‌కాశాన్ని విద్యార్థులంద‌రూ వినియోగించుకోవాల‌ని ఆర్టీజీఎస్ కోరింది.
టీవీ తెరపైన ఫలితాలు....
ఇంటర్మీడియట్ ఫలితాలు ఫైబర్ నెట్ టీవీ తెరపై ప్రత్యక్షం కానున్నాయి ఫైబర్ నెట్ వినియోగదారులు తమ ఇంట్లోనే టీవీ తెరపై రిమోట్ ద్వారా విద్యార్ధుల హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయగానే ఫలితాలు టీవీ తెరపై కనిపించే ఎర్పాట్లు చేశామని ఈ సదుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆర్టీజీఎస్ సూచించింది.

ABOUT THE AUTHOR

...view details