ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రద్దయిన నోట్లను భాజపా నేతలు ఎలా మారుస్తున్నారు?' - తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

హామీ ఇవ్వడం.. తర్వాత మాట తప్పడం మోదీకి అలవాటేనని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. దేశ రక్షణ వ్యవస్థను సైతం రాజకీయాలకు వాడుకోవడం మోదీకే చెల్లిందన్నారు.

తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

By

Published : Mar 30, 2019, 2:46 PM IST

తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
భాజపాకు దేశవ్యాప్తంగావ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఆంధ్రా ప్రజల సెంటిమెంట్‌.. దేశ ప్రజల్ని ప్రభావితం చేస్తోందని చెప్పారు. భాజపాయేతర కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. రద్దయిన నోట్లను ఇంకా ఎలా మార్చుకుంటున్నారో భాజపా నేతలు సమాధానం చెప్పాలన్నారు. రఫేల్‌ కుంభకోణ ఆరోపణలపై భాజపా సరైన సమాధానం చెప్పలేకపోతోందన్న కనకమేడల.. 2019 ఎన్నికల్లో భాజపాకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details