మీడియా సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి చినరాజప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం ఏ మాత్రం బయటికి రాలేదని... తెదేపా సమాచారం మాత్రమే లీక్ అయ్యిందని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. ఈ కారణంతోనే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అనవసరంగా గందరగోళానికి గురిచేస్తోందని హోం మంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయడమేంటని ప్రశ్నించారు. ఈ విషయంపై తామూ సిట్ వేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ కు దమ్ముంటే ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలవాలని సవాలు విసిరారు. ప్రజల ఓట్లు తొలగించేందుకు జగన్ కు ఏం హక్కు ఉందని నిలదీశారు.