వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధినేత జగన్.. హై కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ వాజ్యం దాఖలు చేశారు. ముఖ్యమంత్రి, డీజీపి ప్రమేయం లేని దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు.
వివేకా హత్యపై హైకోర్టులో జగన్ పిటిషన్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధినేత జగన్ కోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసు విచారణ బాధ్యత అప్పగించాలని కోరారు.
వైకాపా అధినేత జగన్
"చిన్నాన్నమృతికి నేనే కారణమంటూ చంద్రబాబు చెబుతున్నారు.ఆ మాటలు దర్యాప్తును ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడిన తరహాలోనే కడప జిల్లా ఎస్పీ మాట్లాడారు.ఎన్నికల సమయంలో లబ్ధిపొందాలనే ఉద్దేశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఈ విషయంలో స్పందించాలి'' - జగన్,వైకాపా అధ్యక్షుడు
Last Updated : Mar 20, 2019, 12:02 AM IST