ఈనెల 23న నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుపతి చేరుకుంటారని జీఏడీ పొలిటికల్ కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. గవర్నర్ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనాతో కలిసి సిసోడియా రాజ్‌భవన్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈనెల 23లోగా రాజ్‌భవన్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. 23న గవర్నర్ తిరుపతి నుంచి విజయవాడ చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. రాజ్‌భవన్ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
23న గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 23వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లను గవర్నర్ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా పర్వవేక్షిస్తున్నారు. మీనాతోపాటు జీఏడీ పొలిటికల్ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉన్నారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్