ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం లేకనే ప్రపంచ బ్యాంకు రుణాలిచ్చేందుకు నిరాకరించిందనితెదేపా శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడమే... వైకాపా నేతలు పనిగా పెట్టుకున్నారని అన్నారు. రివర్స్ టెండరింగ్ ని స్వాగతిస్తామన్న ఆయన..., ప్రాజెక్ట్ ఖర్చు ఎంత తగ్గిస్తారో చూస్తామని చెప్పారు. వైకాపా నేతల వ్యవహారతీరు వల్లే ప్రపంచ బ్యాంకు రుణాలిచ్చేందుకు నిరాకరించిందని తెలిపారు.
'వైకాపా వల్లే ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్లింది' - gorantlas
వైకాపా నేతల వ్యవహార తీరు వల్లే ప్రపంచ బ్యాంకు రుణాలిచ్చేందుకు నిరాకరించిందని తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి