ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్ల పండగకు సిద్ధమైన రాష్ట్రం - ELECTION RUSH

బండెనక బండి కట్టి పట్ట్టణాలు కదిలాయి. నగరప్రజలంతా ఓటు బాట పట్టారు. సొంతూరిలో ప్రజా తీర్పు చెప్పేందుకు ఊత్సాహం చూపిస్తున్నారు. లక్షల్లో వెళ్తున్న జనంతో ప్రయాణప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. వాహనాలు రద్దీగా మారాయి. టోల్‌ప్లాజాల వద్ద బారులు కనిపిస్తున్నాయి.

ఓట్ల పండగను తలపిస్తున్న ఆంధ్రా ఎన్నికలు

By

Published : Apr 10, 2019, 2:35 PM IST

Updated : Apr 10, 2019, 3:30 PM IST

ఓట్ల పండగను తలపిస్తున్న ఆంధ్రా ఎన్నికలు

ఓట్ల పండుగ
రాష్ట్రంలో అసలైన ఓట్ల జాతర ఇప్పుడే మొదలైంది. ఓటు అనే వజ్రాయుధాన్ని సంధించేందుకు సామాన్యుడు కదంతొక్కాడు. సొంతూరిలో ఓటేసేందుకు పయనమవుతున్నాడు. ఓటు మీటపై వేలు కొన మీటుదామంటూ బస్సో, లారీనో, రైలో ఏదో ఒకటి ఎక్కేసి ఊరెళెతున్నాడు. అందుకే బస్‌ ప్రాంగణాలు... రైల్వే స్టేషన్లు ఎక్కడ చూసిన జనసందోహమే. సంక్రాంతికే కనిపించే రద్దీ దృశ్యాలు ఇప్పుడు ఎన్నికల పండగ నాడు కళ్లకు కడుతున్నాయి.


ఓటర్లకు నేతల ఫోన్లు
హోరాహోరీగా తలపడ్డ ఏపీలో పార్టీలకు ప్రతి ఓటూ కీలకమే. అందుకే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయిలో స్థిరపడిన వారికి రాజకీయ నేతలే స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. ఓటు వేసేందుకు రావాలని అభ్యర్థిస్తున్నారు. ముందుగానే బస్సుల్లో, రైళ్లల్లో రిజర్వేషన్ చేయించారు. ప్రత్యేక వాహనాలూ ఏర్పాటు చేశారు. ఆంధ్రాలో నెలకొన్న హోరాహోరీ సమరంతో ఓటర్లు తమ అభిమాన పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. అందుంకే సొంతూరిలో ఓటు వేసేందుకు కాలు కదిపారు.


కలిసొచ్చిన సెలవులు...
గురువారం పోలింగ్ కాబట్టి ఎలాగో సెలవు. ఆ తర్వాత శుక్రవారం ఒక్కరోజు డుమ్మా కొడితే... రెండో శనివారం, ఆదివారం సెలవులు. ఇలా వరుసగా 4రోజులు కలిసొస్తాయి. తెలంగాణలో వేసవి సెలవులు ఇచ్చేశారు. అందుకే... అటు ఓటు వేసినట్టు ఉంటుంది... ఇటు ఇంటికెళ్లినట్టూ ఉంటుందని భావిస్తున్నారు జనం. గతంలో కంటే పెద్ద సంఖ్యలోనే ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కుటుంబాలు కుటుంబాలే కదులుతున్నాయి.


రైళ్లు, బస్సులు ఫుల్- ఆకాశాన టికెట్‌ ధరలు
ఊహించని విధంగా జనాలు ఓట్ల కోసం కదలడంతో బస్సులు, రైళ్లు నిండిపోయాయి. ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా సరిపోవడం లేదు. సీట్లు లేకపోయినా సరే నిల్చోని వెళ్తున్నారు. మరికొందరు సొంత వాహనాల్లో బయల్దేరారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ అమాంతం పెరిగింది. వాహనాలు బారులు తీరిన టోల్​ప్లాజాల వద్ద గంటల సమయం వృథా అవుతోంది. ప్రైవేటు ట్రావెల్స్‌... ఓట్ల పండుగలోనూ నోట్ల పంట పండించుకుంటున్నారు. టికెట్ల ధరలు అమాంతం పెంచేసి ప్రయాణికుల జేబు ఖాళీ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం..

Last Updated : Apr 10, 2019, 3:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details