ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం నామినేషన్.. అది రేపే... మెుదలవ్వబోతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే అభ్యర్థులు చేయాల్సినవి చేయాకూడనివి కొన్ని పనులున్నాయి. వాటిని ఉల్లంఘిస్తే...నామినేషన్ తిరస్కరిస్తారు.
రేపే నామినేషన్...అభ్యర్థులు కాస్త ఇవీ చదవండి
ఎన్నికల షెడ్యూల్...అభ్యర్థుల ప్రకటనలు... అసంతృప్తులు, అలకలు, ప్రచారాలు...ఇలా తలమూనకలైన నేతల ముందుకు మరో కీలక ఘట్టం వచ్చింది.. అదే...నామినేషన్ ప్రక్రియ. రేపటి నుంచి నామినేషన్ స్వీకరణ ప్రారంభమవుతుంది.
* నాకు వేల మంది...కార్యకర్తలు...వాహనాలూ ఎక్కువేనని నామినేషన్ వేసేందుకు పదుల సంఖ్యలో వాహనాలతో వస్తే కుదరదు...3 వాహనాలను మాత్రమే వాడాలి. ఆర్‌ఓ కార్యలయంలోకి అభ్యర్థి సహా ఐదుగురికే మాత్రమే అనుమతి..
* ఆర్‌ఓ కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోకి ఎవరుపడితే వారు వస్తే కుదరదు.
* నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి నామినేషన్ ప్రతాల్లోని అన్నీ ఖాలీలు పూరించాలి.
* పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు నాలుగు సెట్లు దాఖలు చేయోచ్చు.
* పార్లమెంట్ అభ్యర్థులు రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థులు రూ.10 వేలు డిపాజిట్ చెయ్యాలి.
* రిజర్వ్‌డ్ నియోజకవర్గాల పార్లమెంట్ అభ్యర్థి రూ.12,500, అసెంబ్లీ అభ్యర్థి రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి.
* ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకు చెందిన అభ్యర్థులను ఒకరు ప్రతిపాదించాలి. రిజిష్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులను నియోజకవర్గానికి చెందిన 10 మంది ప్రతిపాదించాలి.
* అభ్యర్థులు...తమపై నేర అభియోగం ఉంటే నామినేషన్‌లో తప్పని సరిగా తెలపాలి.
* 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ.
* 20న హోలీ పండుగ, 24న ఆదివారం నాడు నామినేషన్లు స్వీకరించరు. అంటే మిగిలి ఉంది ఆరురోజులే...
* 26న నామినేషన్లను పరిశీలిస్తారు.
* నామినేషన్ల ఉపసంహరణ గడువు 28తో ముగుస్తుంది.
* ప్రతి రోజు వచ్చిన నామినేషన్ల వివరాలు నోటీసు బోర్డులో ఉంచుతారు. నామినేషన్ వేయడానికి ర్యాలీలతో వస్తే...దానికయ్యే ఖర్చును ఎన్నికల ఖర్చుగా నమోదు చేస్తారు.
* అభ్యర్థులు రెండు నియోజకవర్గాలకు మాత్రమే నామినేషన్ వేయవచ్చు. అంతకంటే ఎక్కువ నియోజకవర్గాలకు వేస్తేనామినేషన్తిరస్కరిస్తారు.