ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈనాడు' గూడు కట్టుకున్న ఆశలు

ప్రకృతి బీభత్సానికి సర్వం కోల్పోయిన కేరళ వరద బాధితులకు... ఈనాడు సహాయనిధి ద్వారా కట్టించే ఇళ్ల నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. 116 ఇళ్లు నిర్మించేందుకు... కేరళలోని అతిపెద్ద మహిళా సహాయక గ్రూపు 'కుటుంబశ్రీ'తో ఒప్పందం కుదుర్చుకుంది.

కేరళ వరద బాధితులకు ఈనాడు గృహాలు

By

Published : Mar 1, 2019, 9:27 PM IST

Updated : Mar 2, 2019, 9:41 AM IST

కేరళ వరద బాధితులకు ఈనాడు గృహాలు

ప్రకృతి బీభత్సానికి సర్వం కోల్పోయిన కేరళ వరద బాధితులకు... ఈనాడు సహాయనిధి ద్వారా కట్టించే ఇళ్ల నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. 116 ఇళ్లు నిర్మించేందుకు... కేరళలోని అతిపెద్ద మహిళా సహాయక గ్రూపు 'కుటుంబశ్రీ'తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలివిడతగా... మూడు నాలుగు రోజుల్లోనే 40 ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ఈనాడు ప్రతినిధులు తెలపగా... కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ అభినందనలు తెలిపారు.

కేరళ వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్‌ సేకరించిన... ఈనాడు సహాయనిధితో ఆపన్నులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. రూ. 7 కోట్ల 76లక్షల 99వేల 176 సహాయ నిధితో... బాధితులకు ఇళ్లు కట్టివ్వనుంది. దీని కోసం కేరళలోని అతిపెద్ద మహిళా సహాయక గ్రూపు కుటుంబశ్రీతో ఒప్పందం చేసుకుంది. కుటుంబశ్రీ ప్రతినిధులు, రామోజీ గ్రూప్‌ తరఫున... ఈనాడు సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజాజీ... ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కేరళ ఆర్థికమంత్రి థామస్‌ ఐజక్‌, మరో మంత్రి ఏసీ మొయిద్దీన్‌ సమక్షంలో ఈ అంగీకారం కుదిరింది. ఈ సందర్భంగా కుటుంబశ్రీ ప్రతినిధులు.... రామోజీ గ్రూప్‌ ప్రతినిధులకు నమూనా గృహాన్ని బహూకరించారు.

కేరళ వరదల్లో గూడు కోల్పోయినవారిని ఆదుకునేందుకు గతేడాది... రామోజీగ్రూప్‌ రూ. 3కోట్లతో సహాయ నిధి ప్రారంభించింది. ఒక్క పిలుపుతో ఈనాడుపై ఉన్న అచెంచెల విశ్వాసంతో మానవతావాదులు ముందుకొచ్చారు. వారందరి సహకారంతో ఈనాడు సహాయనిధి రూ. 7కోట్ల 76లక్షల 99వేల 176 పోగైంది. ఈ మొత్తంతో అలప్పుజ జిల్లాలో 116 ఇళ్లు కట్టించనున్నారు. రూ. 6లక్షల వ్యయంతో... ఒక్కో ఇల్లు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. తొలివిడతగా 40 ఆవాసాల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

Last Updated : Mar 2, 2019, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details