ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రెండేళ్లలో పాఠశాలల ముఖచిత్రాన్ని మారుస్తాం' - education minister

రెండేళ్లలో పాఠశాలల ముఖచిత్రం మారుస్తామని మంత్రి సురేష్ అన్నారు. తెదేపా ప్రభుత్వం పాఠశాలల మౌలిక సదుపాయాల కలప్నలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

మంత్రి సురేష్

By

Published : Jul 15, 2019, 11:49 AM IST

గత ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ ఆరోపించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో లక్ష మరుగుదొడ్లు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. టెండర్లపై ధ్యాస తప్ప పారిశుద్ధ్య కార్మికులను ఏ మాత్రం పట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు. సెర్ప్‌ ద్వారా జీతాలు చెల్లించకపోతే పారిశుద్ధ్య కార్మికులు ఎలా వస్తారని ప్రశ్నించారు.
తెదేపా ప్రభుత్వం రేషనలైజేషన్‌ కింద 6వేలకుపైగా పాఠశాలలను మూసివేసిందని.... ఎందుకు మూసివేశారో పరిశీలించాల్సి ఉందని తెలిపారు. పాఠశాలలో స్థితిగతులు మార్చడం అత్యంత అవసరమని సురేష్ వెల్లడించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామని ... రెండేళ్లలోనే ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాన్ని మార్చేస్తామని మంత్రి సురేష్‌ ధీమా వ్యక్తం చేశారు.

శాసనసభలో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి సురేష్

ABOUT THE AUTHOR

...view details