20న ఎంసెట్-19 నోటిఫికేషన్ - 2019
ఈ నెల 20 న ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ లో పరీక్ష, మే 5న ఫలితాలు విడుదలకానున్నాయి.
ఎంసెట్-2019 నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదలకానుంది. 26 నుంచి నెల రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 అపరాధ రుసుంతో మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు గడువు ఉంటుంది. రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 9 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నారు. రూ.5 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 14 వరకు దరఖాస్తుకు అవకాశం ఇస్తున్నారు. ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రూ.10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్ష... ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష నిర్వహించనున్నారు. 22, 23 తేదీల్లో 2 పరీక్షలు రాసేవారు ఉ.10 నుంచి ఒంటిగంట వరకు ఒక పరీక్ష... మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 వరకు రెండో పరీక్ష జరగనుంది. మే 5న ఎంసెట్-2019 ఫలితాల ప్రకటిస్తారు.