ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దూకితే మోదీ స్కార్పియో ఇస్తానన్నాడు' - modi

వంతెన పైనుంచి దూకితే నరేంద్ర మోదీ స్కార్పియో కొనిస్తానని చెప్పాడు.. అందుకే దూకాలనుకున్నా.. పీవీ ఎక్స్​ప్రెస్​ వే పైనుంచి ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి చెప్పిన మాటలివి.

'దూకితే మోదీ స్కార్పియో ఇస్తానన్నాడు'

By

Published : Jul 18, 2019, 10:55 AM IST

'దూకితే మోదీ స్కార్పియో ఇస్తానన్నాడు'

హైదరాబాద్ అత్తాపూర్​లో పై వంతెన మీద నుంచి దూకడానికి యత్నించిన ఓ వ్యక్తిని స్థానిక యువకులు కాపాడారు. నిన్న సాయంత్రం అత్తాపూర్ పిల్లర్ నం.125 వద్ద పీవీ నరసింహారావు పైవంతెన మీద నుంచి దూకడానికి ప్రయత్నిస్తుండగా ...దానికి ఎదురుగా ఉన్న జిమ్​లో వ్యక్తులు గమనించారు. వెంటనే వెళ్లి.. అతడిని చాకచక్యంగా కాపాడారు.

ఆ వ్యక్తి వివరాలు అడిగితే... వంతెన మీద నుంచి దూకితే నరేంద్ర మోడీ... స్కార్పియో వాహనాన్ని ఇస్తానన్నాడని పొంతనలేని సమాధానం చెప్పారు. ఆ వ్యక్తి మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు గుర్తించి... భోజనం పెట్టి పంపించేశారు.

ఇవీ చూడండి: అసోం, బిహార్ వరదల్లో 94కు చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details