'ప్రత్యేక డీఎస్సీ సవరణలకు మరో అవకాశం'
ప్రత్యేక డీఎస్సీ 2019 దరఖాస్తుల్లో తప్పుల సరవణకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. పాత ధరఖాస్తును తొలగించి కొత్త అప్లికేషన్ అప్లోడ్ చేయాలని సూచించింది.
ప్రత్యేక డీఎస్సీ 2019 దరఖాస్తుల్లో తప్పుల సరవణకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. 2012 నుంచి 2018 వరకు నిర్వహించిన టెట్ పరీక్షల్లో స్కూల్ అసిస్టెంట్ భాషేతర పేపర్లలలో వచ్చిన మార్కులు, హాల్ టికెట్ క్రమసంఖ్య, సంవత్సరం వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంలో ఏవైన సవరణలు ఉంటే సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించామని కమిషనర్ వెల్లడించారు. సవరణలు చేసుకునే అభ్యర్థులు పాత దరఖాస్తును డిలీట్ చేసి కొత్త దరఖాస్తును అప్లోడ్ చేయాలని సూచించారు. సవరించిన సిలబస్ సీఎస్ఈ వెబ్ సైట్ లో ఉంచినట్లు కమిషనర్ తెలిపారు.