ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఎస్సీ-2018 నియామక ప్రక్రియలో జాప్యం

డీఎస్​సీ-2018 నియామక ప్రక్రియ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా నిద్రాహారాలు లెక్క చేయకుండా శ్రమించిన వారు.... ఇప్పుడు నియామక ప్రక్రియలో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

dsc-aspirants-problems

By

Published : Jul 19, 2019, 1:59 PM IST

డీఎస్సీ-2018 నియామక ప్రక్రియలో జాప్యం

2017లో డీఎస్​సీ-2018కు ప్రకటన వెలువరించటంతో ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులంతా కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరిగి పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2019జనవరిలో నిర్వహించిన పరీక్షలకు5లక్షల5వేల547మంది హాజరు కాగా... 81.85శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఫిబ్రవరి15న వెల్లడించి మెరిట్‌ జాబితాను అధికారులు విడుదల చేశారు.ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో డీఎస్​సీ నియామక ప్రక్రియకు బ్రేక్‌ పడింది.ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరదించుతూ...గత నెలలో పాఠశాల విద్యాశాఖ డీఎస్​సీ నియామకాలకు తాత్కాలిక షెడ్యూల్‌ విడుదల చేసింది.జూన్‌20నుంచి సెప్టెంబర్‌4వరకూ పోస్టుల వారీగా భర్తీ ఉంటుందని తెలిపినా...ఇప్పటి వరకూ నియామక ప్రక్రియ మొదలు కాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రిన్సిపల్‌,పీజీటీ,టీజీటీ,స్కూల్‌ అసిస్టెంట్‌,ఎస్​జీటీ పోస్టులను వరుసగా భర్తీ చేస్తామని షెడ్యూల్‌లో ప్రకటించారు.కానీ తొలి రెండు విభాగాలైన ప్రిన్సిపల్స్‌,పీజీటీ పోస్టుల నియామక ప్రక్రియే ఇంకా పూర్తి కాలేదు.నియామక ప్రక్రియలో జాప్యమెందుకో తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు కాల్‌ చేసి అభ్యర్థులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక,వేరే ఉద్యోగం చేసుకోవాలో లేదో తెలియక సతమతమవుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details