రాష్ట్రంలో 108,104 సేవలపై శాసససభలో చర్చ జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సేవలు మరుగున పడ్డాయని ఆరోగ్య శాఖ మంత్రి కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) అన్నారు. వీటిని ప్రక్షాళన చేయడానికి నిధులు కేటాయించామని తెలిపారు. చెవి, ముక్కు సమస్యలను 104 పరిధిలో చేరుస్తున్నామని తెలిపారు.
ఏటా 6 లక్షల మంది 108 వాహన సేవలు వినియోగించుకుంటున్నామని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. 108 వాహనంలో రోగిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారని... సిబ్బంది కొరతతో వైద్యం సరైన సమయంలో అందడంలేదని అన్నారు. రోగిని సమీపంలో ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న ఆస్పత్రికి తరలించాలని ఆరోగ్య శాఖ మంత్రి కోరారు. 108 వాహనంలో సుశిక్షితులైన సిబ్బందిని నియమించాలని నివేదించారు. అంబులెన్సులో ఆక్సిజన్ సదుపాయం ఉండాలని గోపిరెడ్డి అన్నారు.
ఆరోగ్య శాఖ మంత్రి ఈ అంశాలపై స్పందిస్తూ... సభ్యుల సూచనలు కచ్చితంగా లెక్కల్లోకి తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.