ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోటస్ పాండ్‌లో దూకుడు రియాల్టీ షో: మంత్రి ఉమ - jagan

లోటస్ పాండ్​లో దూకుడు సినిమాలో బ్రహ్మానందం తరహా రియాల్టీ షో జరుగుతోందని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. సీఎం సర్ అంటేనే జగన్ పలుకుతున్నారని దేవినేని అన్నారు. జగన్ సీఎం పదవీకాంక్షకు పరాకాష్ట ఈ రియాల్టీ షో అని వ్యాఖ్యానించారు.

దేవినేని ఉమ

By

Published : Apr 17, 2019, 10:26 AM IST

జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని దేవినేని ఉమ ఆరోపించారు. లోటస్‌పాండ్​ వేదికగా దూకుడు సినిమాలో బ్రహ్మానందం తరహా రియాల్టీ షో జరుగుతోందని ఎద్దేవా చేశారు. సీఎం సర్ అంటేనే జగన్ పలుకుతారని... పదవీకాంక్షకు పరాకాష్ట చేరిందని ధ్వజమెత్తారు. స్పీకరపై దాడి చేసింది కాక గవర్నర్‌కు అన్నీ అబద్ధాలే చెప్పారని విమర్శించారు. 11వ తేది సాయంత్రమే జగన్ ఓటమి ఒప్పుకున్నారని ఉమ అన్నారు.

తెదేపా ప్రభుత్వం ఎక్కడికీ పోదని... మళ్లీ పాలించేది అదే అని ధీమా వ్యక్తం చేశారు. చంచల్‌గూడ జైలా లేదా చర్లపల్లి జైలుకా అనేది తేల్చుకోవాల్సింది జగనే అని అన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారుని మండిపడ్డారు.

మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమామహేశ్వరరావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details