రైతుల ఆత్మహత్యలపై తెదేపా వాయిదా తీర్మానం - suicide
రైతుల ఆత్మహత్యలపై శాసన మండలిలో తెదేపా వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వంలో చలనం లేదని మండలిలో ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని తెదేపా సభ్యులు పట్టు పట్టారు. వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... ప్రభుత్వంలో చలనం లేదని తెలుగుదేశం ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఆందోళన చేశారు. సభ ప్రారంభంలోనే రైతుల ఆత్మహత్యలు, విత్తనాల కొరతపై వాయిదా తీర్మానం ఇచ్చారు. దీన్ని ఛైర్మన్ షరీఫ్ తిరస్కరించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ...రాష్ట్రంలో 37 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చించకపోతే ఎలాగని తెదేపా సభ్యులు ప్రశ్నించారు. వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు. ఈ అంశంపై వేరే రూపంలో చర్చకు అనుమతిస్తామని ఛైర్మన్ ప్రకటించారు. 20 నిమిషాలకు పైగా సభలో ఆందోళన సాగింది. తర్వాత సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు.