కార్పొరేషన్లకు సభ్యుల నియామకం
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు కార్పొరేషన్లకు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో వెనుకబడిన కులాలలకు చెందిన వివిధ ఆర్ధిక సహకార కార్పొరేషన్లకు బోర్డు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొప్పుల వెలమ, పోలినాటి వెలమ, తూర్పుకాపు, గాజుల కాపు, అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడబలిజ, బెస్త, జాలరి, గంగవర, గోందల, నయ్యాల, ఆర్యవైశ్య యాదవ, తెలికుల, గాండ్ల, గవర, కళింగ, శెట్టిబలిజ, గౌండ్ల, కల్లుగీత కార్మికుల ఆర్ధిక సహకార కార్పొరేషన్ తదితర వాటికి ఛైర్మన్లతో పాటు బోర్డు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.