ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు ప్రజలకు సీఎం శ్రీరామనవమి శుభాకాంక్షలు - chandrababu

దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కల్యాణం కోసం ఆదర్శ పాలన సాగించిన శ్రీరాముడి బాటలో ఐదేళ్లపాటు తాను సుపరిపాలన అందించానని చెప్పారు.

తెలుగుప్రజలకు సీఎం శ్రీరామనవమి శుభాకాంక్షలు

By

Published : Apr 13, 2019, 9:51 PM IST

తెలుగుప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆరు నూరైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడే మనకు మార్గదర్శి అని చెప్పారు. దేశ విదేశాల్లోని తెలుగువారికి ఆయన పండగ శుభాకాంక్షలు తెలిపారు. లోక కల్యాణం కోసం ఆదర్శ పాలన సాగించిన శ్రీరాముడి బాటలో ఐదేళ్లూ తాను సుపరిపాలన అందించానని చెప్పారు. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని తెదేపా ప్రభుత్వమే ఆరంభించిందని గుర్తు చేశారు. ఈ పర్యాయమూ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details