ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమైన సీఎం దిల్లీలో జరిగే ధర్మపోరాట దీక్షకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత మరో విమానంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు దిల్లీకి పయనమయ్యారు. ప్రత్యేకహోదా కోరుతూ రేపు దిల్లీలో ధర్మపోరాటం చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించి, 7:45 కు ఏపీ భవన్‌కు సీఎం చేరుకోనున్నారు. ఉదయం 8 కి ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు ధర్మపోరాట దీక్ష కొనసాగనుంది. చంద్రబాబుతో పాటు ఎన్జీవో సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు దీక్షలో పాల్గొననున్నాయి.