పసిపాప పర్ణిక సమస్యపై సీఎం కార్యాలయం స్పందించింది. పసిపాపకు అత్యవసర చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ జిల్లా గాజువాక పట్టణానికి చెందిన పసిపాప పర్ణిక పేగు వ్యాధితో బాధపడుతోంది. సాయం కోసం చిన్నారి తల్లిదండ్రులు వారం రోజులుగా సచివాలయం దగ్గర ఎదురుచూస్తున్నారు. ఇవాళ చిన్నారి సమస్యను గుర్తించిన సీఎం కార్యాలయం.. వెంటనే అత్యవసర చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.
'పర్ణికకు అత్యవసర చికిత్స.. ప్రభుత్వం ఆదేశం' - పర్ణిక
సచివాలయం వద్ద సీఎం సాయం కోసం ఎదురుచూస్తున్న చిన్నారి పర్ణిక సమస్యపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. అత్యవసర చికిత్సకు ప్రభుత్వం ఆదేశించింది.
పర్ణికకు అత్యవసర చికిత్స అందించాలని ఆదేశం
Last Updated : Jul 17, 2019, 5:31 PM IST