రుణమాఫీ పేరుతో గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని సీఎం జగన్ ఆరోపించారు. గతేడాది కేంద్రం రూ. 76,721 కోట్లు పంట రుణాలిచ్చిందని... రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం లెక్కన రూ.3,068 కోట్లు ఇవ్వాల్సి ఉందని సీఎం తెలిపారు. ఆ మొత్తం చెల్లించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపడ్డారు. ఐదేళ్లుగా రైతులకు రూ.15 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని... అవేవి చెల్లించకుండా దానికే రుణమాఫీ అనే పేరు పెట్టి మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో గత ప్రభుత్వం రైతులకు చెల్లించింది ఏమిటని సీఎం ప్రశ్నించారు.
'రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు' - fires
రైతుల సున్నా వడ్డీపై శాసనసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. గతంలో తెదేపా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని... పంటరుణాలకు కట్టాల్సిన వడ్డీ కట్టకుండా నిర్లక్ష్యం చేసిందని జగన్ ఆరోపించారు.
సీఎం జగన్
ఇదీ చదవండి...'డియర్' కోసం తపన... కామ్రేడ్ ట్రైలర్