ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మణిహారంలో అదాని గ్రూపు

సుందర నగరం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూకడుతున్నాయి. విశాఖలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదాని సంస్థ సిద్ధమైంది. దీనిలో భాగంగా కాపులుప్పాడలో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్​కు సీఎం చంద్రబాబు..నేడు భూమిపూజ చేయనున్నారు.

By

Published : Feb 14, 2019, 6:45 AM IST

Updated : Feb 14, 2019, 6:55 AM IST

అదాని గ్రూపు డేటా సెంటర్​కు భూమిపూజ

విశాఖ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది. సుందర ప్రదేశాలతో పర్యాటక ఆకర్షణగా నిలిచే సాగర తీర నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకగవాక్ష విధానం, పెట్టుబడుల అనుకూల పరిస్థితులు..కొత్త సంస్థల ఏర్పాటు అనువుగా మారాయి.

సీఎం చంద్రబాబు

ఎనర్జీ, లాటిస్టిక్స్, పెట్రోలియం సంస్థల్లో అగ్రగామి అయిన అదాని గ్రూప్ విశాఖలో ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు సిద్ధమయ్యింది. నేటి మధ్యాహ్నం విశాఖ కాపులుప్పాడ ఐటీ పార్క్ వద్ద ఈ ప్రాజెక్టుకు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సంస్థ డైరెక్టర్ రాజేష్ అదాని హాజరుకానున్నారు.

విశాఖలో సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదాని గ్రూపు సుముఖక వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుచేస్తోంది. ఈ పార్క్ ఏర్పాటుతో లక్ష ఉద్యోగాలు కల్పన సాధ్యమవుతుంది.

అదాని డేటా పార్క్ ఒప్పందం ఈ ఏడాది జనవరి 9న జరిగింది. ఒప్పందం జరిగిన నెల రోజుల్లోనే పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన జరగడం విశేషమని అధికారులు అంటున్నారు. ప్రైవేటు సంస్థల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలోని మూడు ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో 1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రి లోకేశ్ కీలక పాత్ర వహించారు. ఆంధ్రప్రదేశ్​ను డేటా హబ్​గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఐటీ మంత్రి లోకేశ్ పనిచేస్తున్నారు. అదాని గ్రూపు రాకతో రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. వీటి సాయంతో లక్ష ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

గౌతం అదాని

ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణహిత డేటా సెంటర్​గా రూపుదిద్దుకుంటున్న ఈ పార్క్​లో​ 5 గిగా వాట్స్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నారు. ఈ సెంటర్​ను ఇంటర్నెట్ కేబుల్ లాండింగ్ స్టేషన్​తో అనుసంధానం చేస్తారు. ఈ విధానంతో దేశంలో వేగవంతమైన అంతర్జాల సేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కానుంది.

అదాని డేటా సెంటర్ ఏర్పాటులో మంత్రి లోకేశ్ కీలక పాత్ర పోషించారు. ఏపీలో అమలు చేస్తున్న క్లౌడ్​హబ్ పాలసీ..సంస్థ ప్రతినిధులకు వివరించారు. సెంటర్ నిర్వహణకు అవసరమైన విద్యుత్​ను తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చారు. అనుమతులు, భూముల కేటాయింపు విషయంలో మంత్రి చూపిన చొరవతో అదాని గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు సీఎం చంద్రబాబు చేపట్టిన విధివిధానాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏపీకి వస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.

Last Updated : Feb 14, 2019, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details