తెలంగాణలోని కూకట్‌పల్లి శేషాద్రి నగర్‌కు చెందిన ఐనేని శశికాంత్ కె.పి.హెచ్.బి. కాలనీలోని కల్ట్.ఫిట్ జిమ్‌లో గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన సభ్యత్వం తీసుకున్నాడు. సభ్యత్వం తీసుకున్న సమయంలో బరువు తగ్గించటమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కావల్సిన శిక్షణ తమ జిమ్‌లో లభిస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఫిట్‌నెస్ ప్యాకేజీ పేరిట 18వేల వరకూ వసూలు చేశారు.
చీటింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ - కూకట్‌పల్లి
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌పై తెలంగాణలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హృతిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్ నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తూ వ్యాయామానికి స్లాట్ ఇవ్వడం లేదంటూ బాధితుడు శశి ఫిర్యాదు చేశారు.
సామర్థ్యానికి మించి అడ్మిషన్లు
ఇప్పుడు జిమ్ సామర్థ్యాన్ని మించి మొత్తం 1800 మంది సభ్యులను జిమ్‌లో చేర్చుకున్నారు. సరైన శిక్షణ లభించకపోగా, వ్యాయామం చేసేందుకు వసతి కూడా లేకపోవటంతో శశికాంత్ ఇదే సమస్యను జిమ్ డైరెక్టర్లకు ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించాల్సిన వారు, పరిష్కారం చేయకుండా శశికాంత్‌ను జిమ్‌కు రాకుండా అతడి కల్ట్.ఫిట్ యాప్‌ను నిలిపి వేశారు.
హృతిక్‌పై చీటింగ్ కేసు నమోదు
మోసపూరిత హామీలతో అమాయకులను మోసం చేస్తున్నారంటూ కల్ట్.ఫిట్ సంస్థ డైరెక్టర్లు ముఖేష్ బన్సాల్, అంకిత్ అగోరి, షణ్ముగవేల్ మణి సుబ్బయ్యలతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో హృతిక్ రోషన్‌పై శశి ఫిర్యాదు చేశాడు. ఐపీసీ సెక్షన్లు 420,406 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.