'అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తెదేపాపై ఆరోపణలు' - ycp
తెదేపా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని మాజీ మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని తెలిపారు.
జగన్ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తమపై బురద చల్లాలని చూస్తున్నారని తెదేపా సీనియర్ నేత చినరాజప్ప దుయ్యబట్టారు. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని సీఎం జగన్ అనడం దారుణమని ఆయన అన్నారు. గురువారం చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం నేతల భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ విచారణకు అయినా ఎదుర్కోవడానికి తామంతా సిద్ధమని, కానీ పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పవర్ కట్ అనేది లేదని, జగన్ సీఎం అయ్యాక నిత్యం కరెంట్ కోతలేనని విమర్శించారు.