సీఎస్‌గా నేడు ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ - anil chandra puneta
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో 1983 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఐపీఎస్‌ల బదిలీ జీవోల వ్యవహారంలో 5 రోజుల క్రితం దిల్లీ వెళ్లిన పునేఠా, కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. తదుపరి ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న ఈసీ... పునేఠాను బదిలీ చేసింది. ఉదయం 10.30 గంటలకు కొత్త చీఫ్ సెక్రెటరీగా ఎల్వీ సుబ్రమణ్యం బాధ్యతలు స్వీకరించనున్నారు.