తెదేపా అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా
తెదేపా అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్న చంద్రబాబు.. నిర్ణయాన్ని మార్చుకున్నారు.
chandrababu_tour_cancel
ఇన్నాళ్లూ విరామం లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో నిమగ్నమైన తెదేపా అధినేత చంద్రబాబు.. విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం, పార్టీ వ్యవహారాలు చక్కబెట్టే పనిలో నిమగ్నమైన కారణంగా.. కొన్నాళ్ల తర్వాత యాత్రకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.