తెదేపా గెలుపును ఆపేశక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు... కియా ద్వారా యువతకు ఉపాధి కల్పించామన్నారు. జిల్లాకు నీరు తీసుకొచ్చి... రైతులకళ్లల్లోసంతోషంనింపామనిఆనందం వ్యక్తం చేశారు. తాను పాదయాత్రకు శ్రీకారం చుట్టింది అనంతపురం నుంచేనని గుర్తు చేసినసీఎం... రైతు రుణమాఫీ హామీ ఇచ్చింది అనంతపురంలోనేని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
'సమయం లేదు తమ్ముళ్లూ' - amaravathi
అభిమానం ఉంటే ఇంటికి ఆహ్వానించి భోజనం పెడతానే తప్ప... అభ్యర్ధుల ఎంపికలో రాజీపడనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్కు రాజకీయం చేతకాకే... బిహారీ కన్సల్టెంట్లపై ఆధారపడ్డారని ఎద్దేవా చేశారు.
5ఏళ్లలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశామన్న ముఖ్యమంత్రి... హంద్రినీవా... సుజల స్రవంతి పూర్తి చేస్తున్నట్టుతెలిపారు. మడకశిర వరకు నీళ్లు తీసుకెళ్లామన్నారు. కష్టాల్లోనూ అనంతపురం జిల్లా పార్టీ వెంటే ఉందన్నారు. ఆస్తులు... ప్రాణాలు పోయినా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో అందరం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్న చంద్రబాబు... జెండా దించకుండా భుజాన మోశారని కొనియాడారు.
అభ్యర్ధుల ఎంపికలో అన్నిచోట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న చంద్రబాబు... అభ్యర్థులు ఇంట్లో కూర్చుంటే కుదరదని తేల్చిచెప్పారు. ఇంటింటికి తిరిగి... చేసింది చెప్పాలన్నారు. పార్టీకి ప్రజల మద్ధతు కూడగట్టాలన్నారు. ఎన్నికల్లో మన పోటీ దుష్ట పార్టీతోనన్న సీఎం... అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల వరకు అందరి ఆలోచనలు విజయంపైనే ఉండాలన్న ముఖ్యమంత్రి... అభ్యర్ధి ఎవరైనా... విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.