ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"వైకాపా వల్లే అమరావతికి నిధులు రాలేదు" - media

అమరావతికి నిధులు రాకపోవడానికి వైకాపానే కారణమని ప్రతిపక్షనేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతలు ఫిర్యాదు చేయడంతోనే ప్రపంచబ్యాంకుకు నిధులివ్వలేదని తెలిపారు.

ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు చేసింది వైకాపానే: చంద్రబాబు

By

Published : Jul 19, 2019, 12:12 PM IST

రైతుల పేరుతో ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు చేసింది వైకాపా నేతలు కాదా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వైకాపానే అని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత వల్ల ఏ ప్రాజెక్టుకూ నిధులు రావట్లేదని చెప్పారు. వాళ్లకు రాష్ట్రాభివృద్ధి పట్టడం లేదనీ.. పులివెందుల గొడవలు ఇక్కడ కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ఇసుక దొరక్క ధర రెండింతలు పెరిగిపోయిందనీ.. నిర్మాణాలు నిలిచిపోయి కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details