ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల సంఘం బిజీబిజీ

ఎన్నికలు నిర్వహణ ఓవైపు... ఫారం-7 ధరఖాస్తుల ఆరోపణలు మరోవైపు...పాలన పరమైన వ్యవహారాలు ఇంకోవైపు... కోడ్ అమలు నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘంపై పని భారం పెరిగిపోయింది. పరిశీలించాల్సిన చాలా దస్త్రాలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.

By

Published : Mar 14, 2019, 2:34 PM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

ఎన్నికల కోడ్ అమలుతో రాష్ట్ర ఎన్నికల సంఘంపై పని భారం ఎక్కువైంది. ఎన్నికల నిర్వహణతోపాటు పాలన పరమైన వ్యవహారాలతో క్షణం తీరిక ఉండటం లేదు. ఫారం-7 దరఖాస్తుల నిశిత పరిశీలనల ఊపిరి సలపనివ్వటంలేదు. ఎన్నికల కోడ్ అమలుతో పాలనా పరమైన దస్త్రాలు పెద్ద ఎత్తు ఎన్నికల సంఘం ఆమోదం కోసం పేరుకుపోయాయి. వాటి క్లియరెన్స్ బాధ్యత పూర్తిగా ఎన్నికల ప్రధానాధికారిది కావడం వల్ల పని భారం విపరీతంగా పెరిగింది.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

క్లియరెన్స్ కోసం కీలక దస్ర్తాలు

కీలకమైన దస్త్రాలన్నీ ఆమోదం కోసం ద్వివేది వద్దకు తరలివస్తున్నాయి. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైళ్లు సీఈఓ అనుమతి కోసం వస్తున్నాయి. ప్రభుత్వ శాఖలో చేపట్టిన పనులు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందేమోనని ఆయనే ప్రతీ దస్త్రాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఓవైపు కొత్త ఓట్ల నమోదు.. మరోవైపు ప్రభుత్వ పాలనా దస్త్రాలతో ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సందడిగా మారింది.

పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
అన్ని దస్త్రాలనూ ఎన్నికల ప్రధానాధికారే పర్యవేక్షించలేని పరిస్థితి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీ కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. సీఎస్‌తోపాటు సాధారణ పరిపాలన శాఖకు చెందిన ప్రవీణ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఈ స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రతీ దస్త్రం సీఈఓ పరిశీలించాలన్న నిబంధనల్ని సడలించి ఈ స్క్రీనింగ్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని విస్తృతంగా వినియోగించాలన్న దానిపై దృష్టిసారించాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి
రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details