ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల బిల్లుకు లోక్​సభ ఆమోదం - andhra pradesh

ఆంధ్రప్రదేశ్​లో కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పాలనే బిల్లుకు లోక్​సభ  ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్​ పనర్విభజన చట్టం ప్రకారం ఈ రెండు విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి ఇచ్చినట్లు మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్​ పోక్రియాల్​ నిషాంక్​ తెలిపారు.

ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల బిల్లుకు లోక్​సభ అమోదం

By

Published : Jul 13, 2019, 6:03 AM IST

Updated : Jul 13, 2019, 6:14 AM IST

ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్​లో కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పాలనే బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 450 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి 420 కోట్లు కేటాయించినట్లు మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్​ పోక్రియాల్​ నిషాంక్​ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు విశ్వవిద్యాలయాలు అనంతపురం, విజయనగరంలో తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​ కు రెండు విశ్వవిద్యాలయాలు, ఏడు సంస్థలు కేటాయించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​ పనర్విభజన చట్టం ప్రకారం ఈ రెండు విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి కేటాయించారు. బిల్లులో విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపుల విషయాల్లో పూర్తిగా సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్​ నేత కె. సురేశ్​ ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల పరిపాలన, పాఠ్యాంశాల సమాచారం ఇవ్వలేదని అడిగారు. గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజన విద్యార్థులకు రిజర్వేషన్​ కల్పిస్తారా లేదా అని ప్రశ్నించారు. గిరిజన విశ్వవిద్యాలయం దేశ నలుమూలల్లో ఉన్న విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆకర్షించాలని వైకాపా సభ్యుడు లావు శ్రీ కృష్ణ అన్నారు.

Last Updated : Jul 13, 2019, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details