ఆఖరి భేటీ! - it grid
రాష్ట్ర సమాచార చోరీపై నెలకొన్న పరిస్థితులే ప్రధాన అజెండాగా... ఇవాళ మంత్రివర్గం భేటీ కానుంది. అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు నగదు బదిలీ పారదర్శకంగా చేయడం... మిగిలిన రెండు విడతల రుణమాఫి నిధుల విడుదల... అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటికే 7జిల్లాల పరిధిలో ఎన్నికల నియామవళి అమల్లో ఉండటం... ఒకట్రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండటంతో...మంత్రివర్గం భేటీలో కొత్త నిర్ణయాలు ఏమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు... అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు నగదు బదిలీ పారదర్శకంగా చేయడం... మిగిలిన రెండు విడతల రుణమాఫి నిధుల విడుదల... అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ అంశాలపైనే కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.