ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీజీఎస్ అద్భుతం.. అభినందించిన కాగ్ బృందం - కాగ్

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని కాగ్ బృందం సందర్శించింది. ప్రజలకు సేవలు అందించే దిశగా.. సాంకేతికతను వాడుతున్న తీరుపై ప్రశంసలు కురిపించింది.

rtgs

By

Published : Jul 19, 2019, 4:30 AM IST

ఆర్టీజీఎస్ కేంద్రంలో కాగ్ బృందం

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ ను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రశంసించింది. ఇది వినూత్న ప్రక్రియ అని అభినందించింది. కాగ్ డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ ఆండ్య్రూ డ‌బ్ల్యూ.కె.లాంగ్‌స్టీ నేతృత్వంలో 17 మంది అధికారుల బృందం స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ స్టేట్ క‌మాండ్ కేంద్రాన్ని సంద‌ర్శించింది. బృందానికి ఆర్టీజీఎస్ సీఈఓ బాబు స్వాగ‌తం ప‌లికారు. ప్రజ‌ల‌కు ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవ‌ల గురించి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంలో టెక్నాల‌జీ ఎలా ఉప‌యోగించుకుంటున్నదీ వివ‌రించారు. గ్రామ వాలంటీర్లు, అమ్మ ఒడి, స్పంద‌న లాంటి కార్యక్రమాల అమ‌లుకు ఆర్టీజీఎస్ ను అనుసంధానిస్తున్న తీరును.. కాగ్ బృందం ప్రశంసించింది. వేగంగా, పార‌ద‌ర్శకంగా సేవ‌లు అందించ‌డానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.

ABOUT THE AUTHOR

...view details