బ్యాలెట్ తో నష్టమేంటి...? - ennikalu
బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటని మంత్రి జవహర్ ప్రశ్నించారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహన్ ఈవీఎంల వల్ల టాంపరింగ్ కు పాల్పడే అవకాశం ఉందని తను రాసిన పుస్తకంలో పేర్కోన్నారని గుర్తుచేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తే కేంద్రానికి వచ్చిన నష్టమేంటని మంత్రి జవహర్ ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ ఈవీఎంల టాంపరింగ్ కు అవకాశం ఉందని బిజెపి ఎంపీ జీవీఎల్ స్వయంగా ఒక పుస్తకం లో రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి వారే ఇప్పుడెందుకు బ్యాలెట్ పేపర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. చాలా దేశాలలో బ్యాలెట్ పేపర్ విధానం కొనసాగుతోందని తెలిపారు. జీవీఎల్ తన వైఖరి మార్చుకుని ఏపీ కి జరిగిన నష్టం గురించి కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.