దగ్గర్లోనే మోదీ పారిపోయే రోజు: చంద్రబాబు - babu on modi in twitter
రాబోయే కాలంలో భాజపా నేతలు పారిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రధాని మోదీని చంద్రబాబు హెచ్చరించారు. అధికారం ఉందని కదా అని.. భాజపాను వ్యతిరేకించే వారిపై, రాష్ట్రాలపై దాడులు చేయిస్తున్నారని విజయవాడలో ఆరోపించారు.
ప్రధాని మోదీ... గుంటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 2014 ఎన్నికల సమయంలో భాజపా ఇచ్చిన హామీలు గుర్తు చేశారు. చెంబుడు మట్టి, నీళ్లు తమ మొహాన కొట్టి అన్యాయం చేసిన మనిషి మోదీ అని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని కదా అని.. భాజపాను వ్యతిరేకించే వారిపై, రాష్ట్రాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాబోయే కాలంలో భాజపా నేతలు పారిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రధానిని హెచ్చరించారు. అద్వానీని మోదీ వెన్ను పోటు పొడిచారని.. అద్వానీ దండం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మోదీదని విమర్శించారు. కుటుంబాన్ని చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందన్న ముఖ్యమంత్రి... మోదీకి మాత్రం కుటుంబం లేదని... బంధాలు లేవని.. కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని అన్నారు.