'ఫొని'తో అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు - chandra babu
బంగాళాఖాతంలో 'ఫొని' తుపాను కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
చంద్రబాబు
'ఫొని’ తుపాను ముప్పు నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తుపాను గమనంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
Last Updated : Apr 28, 2019, 7:14 AM IST