ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యాటక, క్రీడల శాఖ అధికారులతో అవంతి సమీక్ష

పర్యాటక, క్రీడల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అవంతి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు అభివృద్ధి పనులు చేపట్టని వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.

By

Published : Jun 18, 2019, 10:11 PM IST

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

పర్యాటక అభివృద్ధి కోసం లీజుకు ఇచ్చిన భూముల్లో అభివృద్ధిపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పనులు చేపట్టని వారికి నోటీసులు ఇవ్వాలని సమీక్షలో నిర్ణయించారు. పనులు ప్రారంభించేందుకు 3 నెలలు గడువు ఇవ్వాలని నిర్ణయించిన మంత్రి... అప్పటికీ పనులు ప్రారంభించకపోతే లీజు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.

సాంస్కృతిక శాఖలో పలువులు అధికారులను మాతృశాఖకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్న మంత్రి... పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తాం, పని చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యకళాశాల ప్రవేశాల్లో క్రీడలకోటా 2 శాతానికి పెంచాలని సీఎంను కోరతానన్న అవంతి... గచ్చిబౌలి తరహాలో విశాఖ లేదా విజయవాడలో ఐకానిక్ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్టేడియాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details